CM Revanth Reddy | ఢిల్లీలో కాదు గల్లీల్లో ఉండండి.. పదవుల కోసం నన్ను కలవండి.. పార్టీ నేతలపై సీఎం అసహనం
‘ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నారు.. గల్లీలో తక్కువ ఉంటున్నారు’ అని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులపై సీఎం, పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.
- టైమ్ ఇస్తా.. ఓఎస్డీని నియమిస్తా
- పార్టీ, ప్రభుత్వ సమన్వయ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ‘ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నారు.. గల్లీలో తక్కువ ఉంటున్నారు’ అని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులపై సీఎం, పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. ‘ఇప్పట్నుంచి ఇట్ల జరుగొద్దు.. గల్లీలో ఎక్కువ కనిపించాలె.. ఢిల్లీలో తక్కువ కనిపించాలె’ అని హెచ్చరించారు. ‘మీకు ఏదైనా ఉంటే నన్ను కలవండి.. ప్రతిరోజు సాయంత్రం సెక్రటేరియట్లో సమయం కేటాయిస్తా’ అని చెప్పారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల అపాయింట్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో బుధవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌పై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ‘మీరు (మంత్రులు, ఎమ్మెల్యేలు),నేను ఫెయిల య్యాం’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘చేసిన పనిని మనం చెప్పుకోలేపోతున్నాం.. వారేమో (బీఆర్ఎస్) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ పనీ చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సీఎం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశాం.. ఇంకా చేయాలినవి ఉన్నాయి.. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుంది.. ఆ విషయాన్ని నాకు వదలేసి మీ పని మీరు చేయండి’ అని రేవంత్‌రెడ్డి అన్నట్టు తెలిసింది.
నలుగురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేల డుమ్మా
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్యయ సమావేశానికి నలుగురు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇంతటి ముఖ్యమైన సమావేశానికి రాకూడనంతటి పని ఏముందో కనుక్కొని చెప్పాల్సిందిగా సమావేశంలోనే సీఎంవో అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కొండా సురేఖ మాత్రమే వరంగల్‌లో బీరప్ప బోనాల పండుగ ఉన్న కారణంగా రాలేకపోతున్నట్టు సీఎంవో అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

