వందేండ్ల పాఠం.. పోరు కెరటం.. చుక్కా రామయ్య
వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసిన రామయ్యను ఈ కాలం చూడటం కాలానికే ఒక పులకరింత... మూడు తరాలకు పాఠాలు చెప్పిన చదువుల రామయ్య నూరేండ్లుగా ఈ నేలపై నడయాడడం చూసి తరగతి గది పరవశిస్తున్నది.. త్యాగాల దారిని పలవరిస్తూ ఇప్పటికీ ప్రజా పోరాటాలకు బాసటగా నిలుస్తున్న రామయ్యను చూసి వందేండ్ల చరిత్ర కొనియాడుతున్నది.. యావత్తు సమాజమే గర్విస్తున్నది.. చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు అందిస్తున్నది.
వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసిన రామయ్యను ఈ కాలం చూడటం కాలానికే ఒక పులకరింత… మూడు తరాలకు పాఠాలు చెప్పిన చదువుల రామయ్య నూరేండ్లుగా ఈ నేలపై నడయాడడం చూసి తరగతి గది పరవశిస్తున్నది.. త్యాగాల దారిని పలవరిస్తూ ఇప్పటికీ ప్రజా పోరాటాలకు బాసటగా నిలుస్తున్న రామయ్యను చూసి వందేండ్ల చరిత్ర కొనియాడుతున్నది.. యావత్తు సమాజమే గర్విస్తున్నది.. చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు అందిస్తున్నది.
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుల్లో చుక్కా రామయ్య ఒకరు. ఆయన పుట్టి పెరిగిన కాలం వీర తెలంగాణ సాయుధ పోరాట కాలం. ఫ్యూడల్ సమాజంలో ఉండే దుర్మార్గాలను చూసిన రామయ్య వీర తెలంగాణ సాయుధ పోరాటంలో దూకారు. బయటకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి చేపట్టి తరగతి గదికి అంకితమయ్యారు. పిల్లలతో కలిసి వారిలోని నైపుణ్యాలను వెలికితీసే పనికి పూనుకున్నారు. లెక్కలు చెప్పే బోధకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తరగతి గదిలోనే ప్రపంచ రూపకల్పన జరుగుతున్నదన్న దానికి సాక్షిగా భావితరాలను తీర్చిదిద్దారు. రామయ్య లెక్కలు చెప్పడంతోపాటు సామాజిక లెక్కలు గతితప్పినప్పుడల్లా గళం వినిపించారు. పోరాట కాలంతోపాటు ఎదిగివచ్చిన తరం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయనలో సామాజిక చింతన కూడా సజీవంగానే ఉన్నది.
చుక్కా రామయ్య బోధన నుంచి సామాజిక అభివృద్ధిని కాంక్షించి భావితరాల్ని తయారుచేశారు. ఉపాధ్యాయుడైన రామయ్యలో ఉద్యమకారుడు ఉండి ప్రజా పోరాటాలకు మద్దతు తెలుపుతూ వచ్చారు. చదువుల వృత్తిలో ఉండి యూటీఎఫ్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ సమాజంలోని అవకతవకలపై, పాలకుల దుర్నీతిపై తన గళాన్ని వినిపించారు. చదువుల రామయ్య, సామాజిక రామయ్యలిద్దరినీ రెండు చక్రాలుగా చేసుకొని జీవనయానం సాగించారు. ఇది ఆయనలో కనిపించే బహుముఖతత్వానికి నిదర్శనం. ఒకే కుటుంబంలో తాత, తండ్రి, మనవడు, మనవరాలి వరకు మూడు తరాలకు చెందిన వారు ఆయన దగ్గర చదువుకున్నారు. రామయ్య విద్యార్థులతో ఎంతో సులభంగా కలిసిపోతారు. తరగతి గది పిల్లలంటే ఎంత ప్రాణమంటే; తరగతికి హాజరుకాని పిల్లల గురించి వాకబు చేసేవారు. లెక్కలెందుకు చేయడం లేదో అడిగేవారు. అలాగే విద్యార్థులు లెక్క ప్రకారం బడికెందుకు రాలేకపోతున్నారో ఆరా తీసి కారణాలు వెతికేవారు. ఇలాంటి ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు. పిల్లలు కూడా ఆయనను ప్రాణసమానంగా ప్రేమించేవారు.
బోధకునిగా ఇంత సున్నిత మనసత్తత్వం గల రామయ్య, ప్రజా ఉద్యమాలపై పాలకుల దమనకాండను నిరసించేవారు. ప్రజల తరఫున నిలిచి గొంతెత్తి గర్జించి మాట్లాడేవారు. సాంకేతిక విద్యను బోధించారు. సాంకేతిక సైన్యాన్ని తయారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఐఐటీ రావాలని తలచారు, అందుకోసం తపించారు. రాష్ర్టానికి ఐఐటీ రావడంలో చుక్కా రామయ్య పాత్ర ఎంతో ఉన్నది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ శాసనమండలి సభ్యునిగా మండలిలో అడుగుబెట్టి, ప్రజా సమస్యలపై గళం వినిపించారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న రామయ్య మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులపై పోలీసులు లాఠీలెత్తితే హుటాహుటిన క్షణాల్లో వెళ్లేవారు. పిల్లలపై లాఠీలెత్తితే నిరసించారు. పిల్లలకు గాయాలైతే బాధపడేవారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు వద్దని కాలేజీల వెంట తిరిగి చెప్పారు.
చుక్కా రామయ్య ప్రజా సంఘాలతో కలిసి పనిచేశారు. పౌరహక్కులు, మానవహక్కులు, విద్యా హక్కులు, సామాజిక హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాళోజీ వారసత్వంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పొద్దున్నే ఎక్కడున్నా, నడకను మరిచిపోరు. ప్రాతఃకాలమున ప్రకృతిలో తిరుగుతూ వచ్చిన ఆలోచనలను రాతలుగా రాశారు. నడక శారీరక ఆరోగ్యానికే గాక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో రామయ్య నుంచి నేర్చుకోవచ్చు. ఇంట్లో గంట సేపు విధిగా పూజ చేస్తారు. నుదుటి మీద విభూతి బొట్టు చెదిరిపోకముందే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనో, ఇందిరాపార్కులో ధర్నాలోనో, ఏ ఉద్యమ వేదికపైనో మాట్లాడుతూ కనిపిస్తుంటారు.
ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో రామయ్య నుంచి నేర్చుకోవచ్చు. పుచ్చలపల్లి సుందరయ్యను ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. ఏడుకొండల ఎంకన్నను పూజించారు. జైల్లో ఖైదీల విడుదల కోసం ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగారు. నల్లా నర్సింహులు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షంతో కలిసి పనిచేసిన పోరాట రామయ్య ఈ తరం విద్యార్థులతోనూ ఉద్యమంలో అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర జరిగిన పోరులో పాలుపంచుకున్నారు. వరంగల్ జిల్లా జనగామ పోరాటం గురించి కండ్లకు కట్టినట్టు ఆనాటి పోరాటాన్ని చెబుతూ ఉంటారు. త్యాగధనుల పోరాటబాటలో నడిచిన రామయ్య త్యాగధనుడు. రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అలుపెరుగని బాటసారి చుక్కా రామయ్య 101వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్న సందర్భంగా లెక్కల సారుకు, ఉద్యమ మార్గదర్శికి ప్రజందరి తరఫున శుభాకాంక్షలు. వందేండ్ల రామయ్య సార్ జీవితం ఓ పాఠం, ఆయన ఓ పోరు కెరటం.
జూలూరు గౌరీశంకర్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

