హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏలో ప్రత్యామ్నాయ వనరులు పెంచేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో పెట్టుబడులు పెట్టి టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టి ఆదాయాన్ని సృష్టించాలని డిప్యూటి సీఎం భట్టివిక్రమార ఆదేశించారు. మున్సిపల్‌శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసం నాలుగు అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడం, డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడం, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా అభివృద్ధి చేయడం, మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రాముఖ్యతను పెంచడం వంటి వాటిని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు వివరించారు.
డ్రగ్స్ నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్‌గా మార్చేందుకు మురుగు కాల్వలు నిర్మించాలని, చెరువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. మూసీ ప్రక్షాళన పనులు జూన్ నాటికి పూర్తిచేసి సుందరీకరణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. 2031 మాస్టార్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మారు చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ కింద 39 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వేగంగా పరిష్కరించాలని సూచించారు.పారిశ్రామికవాడల్లో భూములు దకించుకున్న వారు వినియోగించకపోతే వెనకి తీసుకోవాలని ఆదేశించారు.