Telangana Police | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్‌శాఖలో అన్ని విభాగాల్లో మొత్తం 76,292 మంది అధికారులు, సిబ్బంది ఉండగా, వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది 4,782 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఎస్పీ నుంచి డీజీ స్థాయి వరకు 67 మంది, కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 3,642 మంది, ఏఆర్‌లో 1,073 మంది ఉన్నారు. మరో 868 మంది హోంగార్డులుగా ఉన్నారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పోలీస్‌శాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్టు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఒక ప్రకటనలో వెల్లడించారు.