
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పామే డు- కొండపల్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్కే మృతదేహంపై ఎర్రజెండా ఉంచి, మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తిచేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో మావోయిస్టులు, గిరిజనులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీలో నాలుగు దశాబ్దాలపాటు కీలకపాత్ర పోషించిన ఆర్కే అనారోగ్యంతో గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే.