హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడుత వెబ్ ఆప్షన్ల గడువు బుధవారంతో ముగియనుంది. బుధవారం వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 28న సీట్లను కేటాయిస్తారు. ఇప్పటికే రెండు విడుతల సీట్ల భర్తీ పూర్తికాగా, తాజాగా మూడో విడుత ముగింపు దశకు చేరుకుంది. ఇంజినీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.