హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ రూ.8.14 కోట్లు కాజేసిన రాజస్థాన్ వ్యక్తి శర్వన్ కుమార్ అలియాస్ శ్రవణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధిగా చెప్పుకొంటూ సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తి చేతిలో దశలవారీగా రూ.8,14,48,000 మోసపోయినట్టు బంజారాహిల్స్‌కు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడని, దీంతో నిందితుడిని రాజస్థాన్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చామని ఆదివారం హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ప్రకటించారు.