చేర్యాల, ఫిబ్రవరి 22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం మల్లయ్య(45) అనే గీత కార్మికుడు రోజు వారి వృత్తి పనిలో భాగంగా మల్లయ్య తాటి వనానికి వెళ్లి కల్లు గీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడికి భార్య మహాలక్ష్మి, కుమార్తె అక్షిత ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్, మండల అధ్యక్షుడు రణం వెంకటేశ్వర్లు తదితరులు కోరారు.