హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బుధవారం రాష్ర్టానికి రానున్నది. నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నది. మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌ల నిర్మాణం, నిర్వహ ణ అంశాలపై బృందం సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు.