హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఉప్పల్ భగాయత్లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్నట్టు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
యజ్ఞానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఆచారి, జూలూరు గౌరీశంకర్, దాసోజు శ్రవణ్, ఉపేంద్రాచారి హాజరవుతారని తెలిపారు.