హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): బంజారా గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో 9.30 గంటలకు భోగ్ బండారా కార్యక్రమం, బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో 11 గం టలకు సభ ఏర్పాటు చేశామని జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ తెలిపారు. ఈ వేడుకలకు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌తోపాటు పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. సేవాలాల్ ఉత్సవాలను పురస్కరించుకొని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథో డ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.