హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఉద్యోగులపై కాం గ్రెస్ సీపీఎస్‌ను రుద్దిన రోజైన సెప్టెంబర్ 1ని ఉద్యోగ సంఘాలు ‘పెన్షన్ విద్రోహ దినం’గా పాటిస్తూ వస్తున్నా యి. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని ఆదివా రం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ గన్‌పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నది. ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మిగతా ఉద్యోగ సంఘాలు సైతం నిరసన చేపట్టాలని నిర్ణయించాయి.
అంటగట్టింది హస్తం పార్టీయే..
రాష్ట్రంలో ఉద్యోగుల పింఛన్ హ క్కును హరించింది కాంగ్రెస్ పార్టీయే. దీనికి పూర్తి బాధ్యత ఆ ప్రభుత్వానిదే. 2004 సెప్టెంబర్ 1న అప్పటి రాజశేఖర్‌రెడ్డి సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎస్‌ను వర్తింపజేస్తూ జీవో-653 జారీచేసింది. ఈ ఒక్క నిర్ణయంతో ఉద్యోగులందరినీ రోడ్డు న పడేసింది. ఈ పాపానికి ఒడిగట్టిన కాంగ్రెస్సే ఇప్పుడు మళ్లీ తెలంగాణలో అధికారంలో వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి 8 నెలలై నా ఉద్యోగ సంఘాలను పిలిచి మా ట్లాడలేదు. కనీసం చర్చించలేదు. పాత పెన్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం అన్ని జిల్లా కేంద్రా ల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దు ; చిన్నారెడ్డికి జేఏసీ వినతి
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధులు చిన్నారెడ్డి ని కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.