బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
- చాకలి ఐలమ్మ జయంతి నేడు
- నివాళులర్పించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్25(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ నెల 26న ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వం ఉన్నదని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని సీఎం అన్నారు. ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హకుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్ణాల త్యాగాలను స్మరించుకొంటున్నామని సీఎం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

