కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుదాం
ఓటు ప్రాముఖ్యతను యువతకు తెలియజేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేలా బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు.
- ఓటు ప్రాముఖ్యతను యువతకు తెలియజేయాలి
- బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్,ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు దిశానిర్దేశం
దుండిగల్, అక్టోబర్ 26: ఓటు ప్రాముఖ్యతను యువతకు తెలియజేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేలా బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల ప్రక్రియ తమ ఇంట్లో నుంచే మొదలు పెట్టాలని, మన ఇంటిలోని పట్టభద్రులతో పాటు కాలనీ, డివిజన్,నియోజకవర్గంలో పరిచయం ఉన్న ప్రతి గ్రాడ్యూయేట్ను గుర్తించి ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేయించాలని, గతంలో ఓటువేసిన పట్టభద్రులు సైతం మళ్లీ ఓటు వేయాలంటే తమ పేరును మళ్లీ ఓటరుగా నమోదు చేయించుకోవాలనే విషయాన్ని వివరించాలని శ్రేణులకు సూచించారు.
రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకువెళ్లిందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు అసమర్థ పాలనను అందిస్తున్నదని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంచి మెజార్టీని సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

