వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు..విద్యుత్ షాక్
అసమర్థ కాంగ్రెస్ పాలనలో నగరవాసులకు మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే తాగునీటి, కరెంటు కష్టాలను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో ఇప్పటికే నగరంలో తాగునీటి అవస్థలుపడాల్సి వస్తున్నది.
- గంటల తరబడి కరెంట్ కట్.. బారులు తీరుతున్న ట్యాంకర్లు
- ఒక్కో ట్యాంకర్ డెలివరీకి3,4 రోజుల సమయం
- నగరవ్యాప్తంగా ఫిల్లింగ్ స్టేషన్లలో వందల్లో పెండెన్సీ
- రెట్టింపైన ప్రజల నీటి కష్టాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అసమర్థ కాంగ్రెస్ పాలనలో నగరవాసులకు మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే తాగునీటి, కరెంటు కష్టాలను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో ఇప్పటికే నగరంలో తాగునీటి అవస్థలుపడాల్సి వస్తున్నది. డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండటంతో జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోవడం లేదు.
దీంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ 7 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఇలా ఒకవైపు ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతుంటే.. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను కరెంటు కోతలు వేధిస్తున్నాయి. గంటల తరబడి విద్యుత్ కోతలు ఉండటంతో ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. ఫలితంగా ఒక్కో ట్యాంకర్ డెలివరీకి మూడు, నాలుగు రోజులుపడుతుండటంతో నగరవాసుల నీటి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అసమర్థ పాలనంటూ.. జనం కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు మొదలవుతున్నాయి. జలమండలి వ్యాప్తంగా ఒక్కో ఫిల్లింగ్ స్టేషన్ ముందు పదుల సంఖ్యలో ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు అత్యవసరమైన తాగునీటి సరఫరా కేంద్రాల్లో కరెంటు కోతలు విధించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో గంటల తరబడి కరెంటు పోతుండటంతో వందలకొద్ది పెండెన్సీ నమోదవుతున్నది. బుకింగ్స్ జరుగుతున్నా కరెంట్ లేకపోవడంతో మోటార్లు ఆగిపోయి ట్యంకర్లు నింపడం లేదు. దీంతో ట్యాంకర్ యజమానులు గంటల తరబడిగా ఫిల్లింగ్ స్టేషన్ల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో డెలివరీలు సకాలంలో జరగటం లేదు. ట్యాంకర్లు బుక్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న నాలుగు ఐదు రోజులకు ఒకసారి డెలివరీ అవుతున్నాయి. ఒకవైపు వాటర్ డిమాండ్, మరోవైపు కరెంట్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
తాగునీరు, విద్యుత్ ప్రజలకు అత్యవసర మౌలిక వసతులు. కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల మరో అత్యవసరమైన తాగునీళ్లు ప్రజలకు సకాలంలో అందడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల నీళ్లు, కరెంటు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నామని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిగ్గా అందక ట్యాంకర్లను బుక్ చేసుకుంటే.. కరెంట్ కోతలతో అవీ సకాలంలో అందకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. కనీసం ఫిల్లింగ్ స్టేషన్లకు కరెంటు సక్రమంగా ఇస్తే కొంత వరకైనా నీటి ఇబ్బందుల నుంచి బయటపడతామని వినియోగదారులు అంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

