అధికార పోరాటమే ఇతివృత్తంగా?
ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్' ఫ్రాంచైజీ, ‘సలార్' చిత్రాల కథాంశాలు లార్జర్ దేన్ లైఫ్ తరహాలో సాగుతాయి. భయంకరమైన సమస్యల చుట్టూ కథల్ని నడుపుతూ.. అద్భుతమైన ఎలివేషన్స్‌తో హీరోల పాత్రను ప్రజెంట్ చేసి, క్యారెక్టరైజేషన్ విషయంలో ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ, ‘సలార్’ చిత్రాల కథాంశాలు లార్జర్ దేన్ లైఫ్ తరహాలో సాగుతాయి. భయంకరమైన సమస్యల చుట్టూ కథల్ని నడుపుతూ.. అద్భుతమైన ఎలివేషన్స్‌తో హీరోల పాత్రను ప్రజెంట్ చేసి, క్యారెక్టరైజేషన్ విషయంలో ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఆయన ‘డ్రాగన్’ చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మామూలుగా లేవు. దానికి తగ్గట్టే ‘డ్రాగన్’ కథానేపథ్యం ప్రశాంత్‌నీల్ గత చిత్రాలను మించే స్థాయిలోనే ఉన్నది. నల్లమందు సామ్రాజ్యాధిపత్యం కోసం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తమని తెలిసింది. బ్రిటీష్ పాలనానంతరం 1960ల్లో భారతదేశంలో జరిగే కాల్పనిక కథ ఇదని, తీవ్రమైన అధికార పోరాటం చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నది.
ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలతోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివరినాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రశాంత్‌నీల్ ముందుకెళ్తున్నారట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. బిజు మీనన్, బాబీ సింహా, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నందమూరి కల్యాణ్‌రామ్, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

