గ్రాడ్యుయేట్ ఓటు నమోదులో ఈసీ నిర్లక్ష్యం
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- సర్కార్‌పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడమే మానేసింది. ఉచిత విద్యుత్ సరఫరాలో కోతలు, తాగునీటి ఎద్దడి, రైతాంగం ఎదురొంటున్న కష్టాలపై సీఎం రేవంత్ రెడ్డికి ధ్యాసలేదు.
సిటీబ్యూరో, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో గతంలో లక్షా పది వేల మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ ప్రక్రియ ద్వారా కేవలం 23 వేల మంది కూడా నమోదు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నవంబర్ 6వ తేదీతో గడువు ముగియనున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీఎల్ఓల కొరత వేధిస్తోందని, ఎంఆర్ఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడంలో నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్ మెంట్లలో పాదయాత్రగా తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు కార్యక్రమం బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉన్నప్పటికీ పట్టించుకోని కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఎల్ఓలను కూడా నియమించలేదని మండిపడ్డారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో హైదరాబాద్ నగర పరిధిలో ఒక లక్ష 10 వేల మంది గ్రాడ్యుయేట్ లు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని పేరొన్నారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ల నుండి ఓటరు నమోదు పత్రాలు స్వీకరించి అధికారులకు అందజేస్తే అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కూడా ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్థపాలన వల్ల ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధిని గాలికొదిలేసిన రేవంత్ సర్కార్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడమే మానేసిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సరఫరాలో కోతలు, తాగునీటి ఎద్దడి, రైతాంగం ఎదురొంటున్న కష్టాలపై సీఎం రేవంత్ రెడ్డికి ధ్యాస లేదన్నారు. ఢిల్లీ పర్యటనలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాలు, సొంత పార్టీ నేతల నుంచి మెప్పు పొందేందుకే సీఎం ప్రాధాన్యమిస్తున్నారే తప్ప.. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించి రెండేళ్లు దాటుతున్నా పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదని ఆరోపించారు.
కేసీఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను తామే చేశామని చెప్పుకోవడం తప్ప ఆసుపత్రి కార్యకలాపాలను అందుబాటులోకి తేలేదని, ఆసుపత్రి సందర్శనకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుని అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జీ గోసుల శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, మహేశ్వరి, అత్తిలి అరుణ గౌడ్, కుర్మ హేమలత, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే నాగులు, టి. శ్రీహరి, ప్రవీణ్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

