నేడు బీఆర్ఎస్ ‘చలో కర్ణాటక’
కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ బృందం ఆదివారం చలో కర్ణాటకకు పిలుపునిచ్చింది.
- కృష్ణ, భీమాపై అక్రమ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్న బృందం
- మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీ శ్రేణుల పర్యటన
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక ప్రభు త్వం భీమా, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ బృందం ఆదివారం చలో కర్ణాటకకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల ను దృష్టిలో పెట్టుకుని శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించింది. రెండు నదులపై బ్రిడ్జి కం బ్యారేజీల పరిశీలనతోపాటు నారాయణపూర్ డ్యామ్‌ను సందర్శించనున్నట్టు తెలిపింది.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్తోపాటు ముఖ్య నేతలు తరలివెళ్లనున్నారు. వీరంతా కర్ణాటకలోని కృష్ణ, భీమా నదుల పరీవాహక ప్రాంతాలను పరిశీలించనున్నారు.
ఈ రెండు నదుల కు వస్తున్న వరద జలాలు తెలంగాణకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బచావత్ ట్రి బ్యునల్ ఆదేశాలను తుంగలోకి తొక్కి ఎగువ రాష్ట్రం తెలంగాణకు చుక్క నీరు రాకుండా ఎక్కడికక్కడే అక్రమంగా చి న్నచిన్న బరాజ్‌లు నిర్మించిందని ఆరోపించారు. వీటిని పరిశీలించి రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా బహిర్గతం చేస్తామని తెలిపారు.
సీఎం హోదాలో రేవంత్ సొంత జిల్లాకు చేస్తు న్న అన్యాయాన్ని నిరసిస్తూ మరో ఉ ద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును చెరబడుతున్న ఏపీ, కర్ణాటక బండారాన్ని బ యటపెట్టిన నేతలు.. ఈసారి కృష్ణా, భీమా నదులపై నిర్మిస్తున్న వాటిపై సమరభేరి మోగించనున్నారు. కర్ణాటక జలదోపిడీని తెలంగాణ ప్రజలకు వివరించేందుకే ఈ పర్యటన నిర్వహిస్తున్నట్టు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

