హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ సీట్లకు అనుమతినిచ్చి, మాప్ అప్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఇందుకోసం ఢిల్లీకి వెళ్లారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో 3- 4 వేల సీట్లు పెంచుకునేందుకు పలు కాలేజీలకు ఏఐసీటీఈ, జేఎన్టీయూలు పచ్చజెండా ఊపాయి. వీటిలో కోర్సుల కన్వర్షన్ సహా అదనపు సీట్లున్నాయి. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో కాలేజీలు ఆయా సీట్లను కోల్పోయాయి. వాటిని మినహాయించే ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ద్వారా 75వేలకు పైగా బీటెక్ సీట్లను భర్తీచేసింది. అయితే ఇదే అంశాన్ని కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. తొలుత కాలేజీలకు వ్యతిరేఖంగా తీర్పు వచ్చినా, మళ్లీ కాలేజీలు హైకోర్టులో డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో కాలేజీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయా సీట్ల భర్తీకి మాప్ అప్ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని డివిజన్ బెంచ్ స్పష్టంచేసింది. రెండుమూడు రోజుల్లో మాప్ అప్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుందని అంతా భావించారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఆయా సీట్ల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్పడినట్లయ్యింది.
మాడల్ టీచర్ల బదిలీలకు మోక్షం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను అధికారులు చేపట్టారు. ఇదివరకే వెబ్ ఆప్షన్లు స్వీకరించడంతో బదిలీలు చేపట్టనున్నారు. మాడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలకు హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. స్కూళ్లల్లో చేరిన తేదీ ప్రకారమే ఎన్టైటిల్మెంట్ పాయింట్స్ ఇవ్వాలని ఆదేశించింది. 194 మోడ ల్ స్కూళ్లలో 2013, 2014లో ని యామకమైన 3వేలకు పైగా ఉపాధ్యాయుల బదిలీలకు అవకాశమేర్పడిం ది. బదిలీల ఆప్షన్స్ ఎడిటింగ్‌కు ఒక రోజు అవకాశం కల్పించాలని పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ ఉన్నతాధికారులను కోరారు.