కొత్తపల్లి, ఏప్రిల్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాగి శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రటరీ సర్దార్ హర్మీందర్సింగ్ను బుధవారం కరీంనగర్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.
ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడారు. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని మారం జగదీశ్వర్ చెప్పారు.