పాలమూరు జిల్లా మున్నూరు కాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక ఈ నెల 26న జరగనుంది. పాలమూరులోని తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న టీఎన్జీఓ భవనంలో ఈ ఎన్నిక జరగనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు దుంకుడు శ్రీనివాసు, గౌరవ అధ్యక్షుడు బుక్క స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, ఎన్నికల అధికారిగా సమీర్కుమార్ పటేల్లు వ్యవహరించనున్నట్లు వారు వెల్లడించారు.