హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు వీలుగా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. ఈమేరకు సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్లతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినితపత్రం సమర్పించింది. 2023 జూలై 1 నుం చి అమలయ్యేలా పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు ఐఆర్‌ను ప్రకటించాలని కోరారు.