బీజేపీయే మా శాశ్వత శత్రువు
బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టకపోతే ఆ పార్టీని శాశ్వతంగా బొందపెడతామని హెచ్చరించారు.
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ పార్టీయే తమ శాశ్వత శత్రువు అని, దళితులు ఆ పార్టీని వెలివేయాలని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టకపోతే ఆ పార్టీని శాశ్వతంగా బొందపెడతామని హెచ్చరించారు. శనివారం హైదరా బాద్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మనువాద ముసుగులో దళితులను గుడులకు, బడులకు దూరం చేసిన చరిత్ర బీజేపీదేనని మండిపడ్డారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యామని ధ్వజమెత్తారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు. దళితులకు బీజేపీ ప్రధాన శత్రువని, ఓటుతోనే ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకట్, వరింగ్ ప్రెసిడెంట్ చందు, ప్రధాన కార్యదర్శులు తిరుమలేశ్, ధర్మారపు శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు నాగరాజు, కిరణ్, శ్రీకాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

