హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఆర్ తిరుపతిని నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం జీవో 353 వెలువడింది. ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చేస్తున్న ఆయన పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసిన ప్యానల్ నుంచి ఖరారు అయ్యింది. తిరుపతి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఏడాదిపాటు కార్యదర్శిగా కొనసాగుతారు. న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తారు.