శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టువస్ర్తాలు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
- స్థలమిస్తే..200 గదుల భవనం కడతాం: టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తరపున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. శివస్వాములతో శ్రీశైలం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టీటీడీ దేవస్థానం తరపున రెండు వందల గదుల భవనం కడతామని ప్రకటించారు. క్షేత్రంలో టీటీడీ సత్రం పాతపడటంతో వాటిని ఆధునీకరిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

