హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 శ్రీఘ్ర దర్శనానికి 3 గంటలు, టోకెన్ పొందిన భక్తుల సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపారు. తిరుమలలోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం చక్రస్నానంతో ఉత్సవాలు ముగిశాయి.