మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 19: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి రోడ్డు దాటుతున్నట్టు ఓ వీడియో శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. గోదావరిఖని వైపు కారులో వెళ్తున్న ప్రయాణికులు తమ ఫోన్లో చిత్రీకరించి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఆర్కేపీ ఓసీ ఏరియా అని, మరికొందరు శ్రీరాంపూర్ ఏరియా అని స్టేటస్ పెట్టడంతో అసలు పులి వచ్చింది నిజమా? కాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.