హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): నిర్మల్ జిల్లా ప్రజల గుండెల్లో పెద్దపులి సంచారం దడ పుట్టిస్తున్నది. పది రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెబ్బులి.. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. సారంగపూర్, నర్సాపూర్, కుంటాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నది. పశువుల మంద మీద దాడి చేసి మూడు పశువులను హతమార్చింది. అలర్ట్ అయిన అటవీశాఖ ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచింది.
వలస వచ్చిన పులిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు చెమటోడుస్తున్న ది. ఈ బెబ్బులి వయస్సు ఆరేండ్లకు పైగానే ఉంటుందని.. మహారాష్ర్టలోని పెన్‌గంగ టైగర్‌జోన్‌లో సంచరించే జానీ టైగర్‌గా గుర్తించినట్టు భైంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతున్నట్టు ఎఫ్ఆర్వో పేర్కొన్నారు.