పులుల మృతిపై సీసీఎంబీ అధ్యయనం
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అడవుల్లో మరణించిన పులుల నమూనాలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చేరుకున్నాయి. ఒకే నెలలో రెండు పులులు మృతిచెందడంపై సమగ్ర అధ్యయనం కోసం వాటి నుంచి సేకరించిన వెంట్రుకలు, రక్తం, మాంసం నమూనాలను సీసీఎంబీకి అందజేశారు.
- మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చేరిన నమూనాలు
హైదరాబాద్ సిటీబ్యూ రో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అడవుల్లో మరణించిన పులుల నమూనాలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చేరుకున్నాయి. ఒకే నెలలో రెండు పులులు మృతిచెందడంపై సమగ్ర అధ్యయనం కోసం వాటి నుంచి సేకరించిన వెంట్రుకలు, రక్తం, మాంసం నమూనాలను సీసీఎంబీకి అందజేశారు. గతంలో హిమచల్‌ప్రదేశ్, కశ్మీర్‌లోని కొన్ని జంతువులపై అధ్యయనం చేసిన సీసీఎంబీ.. ఇప్పుడు పులుల మరణంపై శాస్త్రీయ అధ్యయనం జరుపనున్నది. ఈ అధ్యయనం పూర్తయ్యేందుకు రెండు వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత అటవీ శాఖాధికారులకు నివేదికను అందజేస్తామని సీసీఎంబీ వర్గాలు వెల్లడించాయి. కాగజ్‌నగర్‌లోని దరిగాం అటవీ ప్రాంతంలో ఈ నెల 6న రెండు పులుల మధ్య జరిగిన కొట్లాటలో ఓ పులి చనిపోయినట్టు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలో మరో పులి చనిపోవడంతో వాటి నమూనాలను సేకరించారు. ఆసిఫాబాద్ పులి మరణానికి విషప్రయోగమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.
అటవీశాఖ అధికారుల సస్పెన్షన్
దరిగాం అడవుల్లో పులుల మృతి ఘటనలో నలుగురు అటవీ అధికారులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్ఆర్వో వేణుగోపాల్, ఎఫ్ఎస్వో పోశెట్టి, బీట్ అధికారి శ్రీకాంత్‌ను మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

