ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. సింగరకొండపల్లి, కేశవాపూర్, నర్సాపూర్ శివార్లలో పెద్దపులి తిరుగుతున్నది. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పొలాల వద్దకు వెళ్లకూడదని చెప్పారు. పులిని గుర్తించేందుకు ఆయా గ్రామాల్లో ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేశామని, దాని కదలికలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. పట్టుకునేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు.