భీంపూర్, నవంబర్ 27 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి శివారులో గల రిజర్వాయర్ కట్ట నిర్మాణ ప్రాంతానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి మళ్లీ పెద్ద పులి కనిపించింది. దీంతో అక్కడ కట్ట నిర్మాణ పనులు చేపడుతున్న కూలీ లు భయాందోళనకు గురయ్యారు. తమ సెల్ఫోన్లో ఫొటోలు కూడా తీశారు. ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు బేస్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎనిమల్ ట్రాకర్స్, సీసీ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎఫ్ఆర్వో గులాబ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్ తెలిపారు.