
భద్రాద్రి: జిల్లాలోని టేకులపల్లి అటవీ ప్రాంతంలో పులి (Tiger) సంచరిస్తున్నది. శనివారం ఉదయం మొట్లగూడెం-జంగాలపల్లి బీట్ పరిధిలోని జంగాలపల్లి గేట్ వద్ద పులి రోడ్డు దాటుతుండగా అటవీ సిబ్బంది, ట్రాక్టర్ డ్రైవర్లు చూశారు. దీంతో స్థానిక ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని సూచించారు. కాగా, భయాందోళనలకు గురైన ప్రజలు.. పులిని తొందరగా పట్టుకోవాలని కోరుతున్నారు.