కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
గతేడాది కాగజ్నగర్ అటవీ డివిజన్లో కొంతమంది దుండగులు రెండు పులులపై విష ప్రయోగం చేసి హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. తాజాగా.. ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చిన ఘటన అటవీశాఖలో కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు శుక్రవారం పులి కళేబరం లభ్యమైనట్టు తెలిసింది.