తల్లీబిడ్డను మింగిన పిడుగు
- మంచిర్యాలలో ద్విచక్రవాహనంపై దవాఖానకు వెళ్లివస్తుండగా ఘటన

గర్మిళ్ల, సెప్టెంబర్ 20: ఏడాదిన్నర బాబును దవాఖానలో చూపించుకొని వస్తున్న ఓ కుటుంబాన్ని పిడుగు బలితీసుకున్నది. ఈ ఘటనలో తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన తండ్రి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లకు చెందిన వెంకటేశ్, మౌనిక దంపతులకు ఏడాదిన్నర కుమారుడు శ్రేయాన్ ఉన్నాడు. వెంకటేశ్ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రేయాన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి నస్పూర్‌కు బయల్దేరారు. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి వస్తుండగా ఉదయం 11 గంటల ప్రాం తంలో వారిపై పిడుగు పడింది. భార్య మౌనిక (28) అక్కడికక్కడే మృతి చెం దింది. కుమారుడు శ్రేయాన్ దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. వెంకటేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

