అచ్చంపేట రూరల్, నవంబర్ 8: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఉపాధి హామీలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు పడింది. 2023-24 మార్చి ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి పనులపై జరిగిన సోషల్ ఆడిట్లో అవకతవకలకు పాల్పడగా.. విధించిన జరిమానా చెల్లించడంలో విఫలమైన వీరిని సస్పెండ్ చేసినట్టు డీఆర్డీవో ఓబులేశ్ తెలిపారు. టీఏలు పర్వతాలు, పరమేశ్, వెంకటేశ్వరీతోపాటు ఎఫ్ఏ నరేశ్‌ను సస్పెండ్ చేశారు. 2024-25 మార్చి లేబర్ బడ్జెట్లో కూలీల ముందస్తు జాబితాల తయారీలో విఫలమైన 38 మంది పంచాయతీ కార్యదర్శులు, 8 మంది టీఏలు, 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.