హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో గురువారం పది గంటల వ్యవధిలో ముగ్గురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు తమ దవాఖానలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 141కి చేరినట్టు నిమ్స్ యూరాలజీ బృందం ఒక ప్రకటనలో వెల్లడించింది.
కిడ్నీ గ్రహీతల్లో ముగ్గురూ ఊబకాయులేనని తెలిపింది. గత రెండేండ్లలో 400 రోబోటిక్ సర్జరీలు పూర్తిచేసినట్టు పేర్కొంది. వీటిలో ఐదు రోబోటిక్ కిడ్నీ మార్పిడులు కూడా ఉన్నాయని వెల్లడించింది.