కుమ్రం భీం ఆసిఫాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలకు నష్టం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా వరదల నేపథ్యంలో అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. పని చేయని వారిపి వేటు వేస్తున్నది.
కాగా, జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులలో ప్రత్యేక విధులు కేటాయించిన ముగ్గురు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీఆర్ఏల అలసత్వం కారణంగా 8 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడని, ఈ కారణంగా వీరితో పాటు కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జనకాపూర్ వీఆర్ఏను ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం-2005 క్రింద సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.