హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. మరొకరు ఒమిక్రాన్ బాధితుడి కాంటాక్ట్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి పెరిగింది. మరోవైపు రిస్క్ దేశాల నుంచి ఆదివారం 248 మంది ప్రయాణికులు రాగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 109 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. 190 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 98.90 శాతానికి పెరిగింది. మరో 3.147 మంది ఇండ్లలో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ నుంచి అనంతపురం వచ్చిన వ్యక్తితో పాటు, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మరో వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది.