జోగులాంబ గద్వాల : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ( Lightning ) ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐజ ( Ija Mandal ) మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి .
ఐజ మండలం భూమ్పురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు ఏడుగురు కూలీలు వెళ్లారు. సాయంత్రం వర్షం కురయడంతో కూలీలు అందరూ పొలంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లగా అదే సమయంలో ఉరుములు, మెరుపులతో చెట్టుపై పిడుగు పడింది.
ఈ సంఘటనలో భూమ్పురానికి చెందిన సర్వేష్ (19), పార్వతి (28), పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ (45) అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో నలుగురుని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.