Devarakonda | స్వీట్ షాపులోకి దూసుకెళ్లిన డీసీఎం.. ముగ్గురు దుర్మరణం
నల్లగొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున దేవరకొండ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి స్వీట్ షాప్‌లోకి దూసుకెళ్లింది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున దేవరకొండ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి స్వీట్ షాప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను అబ్దుల్ ఖాదర్, హాజీ, నబీనగా గుర్తించారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన 14 మంది మినీ వ్యాన్‌లో ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మళ్లీ తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున.. మడకశిర మండలం బుళ్లసముద్రం వద్ద ఆగి ఉన్న లారీని వారి వాహనం ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

