సింగరేణి జంగ్ సైరన్.. కోల్‌బెల్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది. టీబీజీకేఎస్ తోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంసీ, బీఎంఎస్, సీఐటీయూ వంటి జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఉదయం మొదటి షిప్ట్ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ సమ్మె మూడురోజులపాటు కొనసాగనుంది. ఈ సమ్మెలో సుమారు 40 వేల మందికిపైగా సింగరేణి కార్మికులు, మరో 25 వేల మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.

నాలుగు బ్లాకుల వేలం..
సింగరేణి పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం.. కావాలనే కేకే-6, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి, కేవోసీ బ్లాక్-3లను వేలం వేయాలని నిర్ణయించింది. చాలాకాలంగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది.

కేకే-6లో 70 మిలియన్ టన్నులు, సత్తుపల్లి బ్లాక్-3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, కేవోసీ బ్లాక్-3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీఎంపీడీఐ (కోల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్) కూడా ఈ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సిఫారసు చేసింది.

ఇప్పటికే ఇక్కడ ఉన్న తమకే కేటాయించాలని, కొత్తగా వేరే కంపెనీలకు కేటాయిస్తే పని చేయలేవని కూడా తమ సిఫారసులో పేర్కొన్నది. అయినా వినకుండా.. కేంద్రం, బొగ్గు మంత్రిత్వ శాఖలు కక్షపూరితంగానే సింగరేణికి కేటాయించకుండా వేలం వేయాలని నిర్ణయించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

