హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ మోసం కేసులో రూ.5.4కోట్లు లూటీ చేసిన హైదరాబాద్కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ సైబర్ దొంగలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి ద్వారా పలు అంతర్జాతీయ ఫ్రాడ్ నెట్వర్క్ల గుట్టు తెలుసుకున్నారు. అరెస్టు అయిన వారిలో మహ్మద్ ఇలియాస్, మహ్మద్ రిజ్వాన్, సయ్యద్ గులాం అసారీ ఉన్నారు. వీరి నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలిసిన వారికి చెందిన 17 ఖాతాల వివరాలు తీసుకొని, వాటిని సైబర్ నేరస్తులతో కలిసి రూ.1.34 కోట్లకు మోసం చేశారు.