ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ముగ్గురి అరెస్ట్
TRS MLAs purchase case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురి చేసిన కేసులో ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాలకు గురి చేసిన కేసులో ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఉన్నారు. షేక్‌పేటలోని హిల్‌టాప్ అపార్ట్మెంట్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు తీర్పులను వెలువరించాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.కోట్ల నగదు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంపై నమోదైన కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నవంబర్ 4 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అలాగే సైబరాబాద్ పోలీసులు వేసిన మరో పిటిషన్లో.. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు అనుమతిస్తూ మరో ధర్మాసనం తీర్పును వెలువరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

