హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : సంచలనం సృష్టించిన నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో మరో ముగ్గురిని సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శ్రీలంకకు చెందిన వారుణియ తిరువానవుక్కరసు, తమిళనాడుకు చెందిన సంజిక, ప్రియాధర్మలింగం తమిళనాడు నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా చెన్నైలో అరెస్టు చేశారు.