Women Groups | మహబూబ్‌నగర్, జనవరి 16 : మహబూబ్‌నగర్‌లో శనివారం సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా నిర్వహించే సభకు జన సమీకరణకు కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నది. మహిళలు భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో అధికారులు మహిళా గ్రూప్ సభ్యులకు బెదిరింపు కాల్స్ చేసినట్లు తెలిసింది.
పాలమూరు జిల్లాలోని మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు హాజరుకావాలని, లేకుంటే రుణాలు మంజూరు చేయమంటూ ఓ అధికారిణి సంఘాల గ్రూప్ వాట్సాప్‌లో పెట్టిన వాయిస్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘గుడ్‌మార్నింగ్ అందరికీ తెలియజేయడం ఏమనగా.. నేడు సీఎం కార్యక్రమం ఉంది.. ప్రతి గ్రూప్ నుంచి ముగ్గురు చొప్పున మహిళా సభ్యులు తరలాలి. రాని వారికి లోన్లు.. పథకాలు అందించడం జరగదు.. ఇది గమనించుకొని శనివారం ఉదయం 10 గంటల వరకు కమ్యూనిటీ హాల్‌కు రావాలి’ అంటూ ఆదేశిస్తూ పెట్టిన వాయిస్ మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.