అబిడ్స్, సుల్తాన్‌బజార్, మే 29: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌కు బుధవారం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతంలో కూడా పలుమార్లు ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వేర్వేరు నంబర్లతో ఫోన్లో వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరించారని తెలిపారు. అందులో పాలస్తీనాకు చెందిన తీవ్రవాది ఫొటో, నంబర్ స్పష్టంగా కనిపించిందని, హిందూ ధర్మం పట్ల పని చేయొద్దని, చేస్తే కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరించారని రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు.