OU Doctorate | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో తోకల విజయకుమార్ డాక్టరేట్ సాధించారు. డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ పర్యవేక్షణలో “పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగంపై రిస్క్ మరియు రివార్డ్‌లు – కస్టమర్ల ప్రభావంష అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి విజయకుమార్ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన ఆయన తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తి చేసి నెట్, జేఆర్ఎఫ్, సెట్ అర్హత సాధించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొంది సెట్ అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.