జడ్చర్లటౌన్, మే 5 : ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయాం.. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఆ పార్టీకి ఓటెయ్యం.. బీఆర్ఎస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గైరాన్ తండావాసులు ప్రతిజ్ఞ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం జడ్చర్ల మండలంలోని గైరాన్‌తండా, మొరంబాయితండా, లక్ష్మణ్నాయక్తండాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గైరాన్‌తండా వాసులు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే తండాలను జీపీలుగా ఏర్పాటు చేయడంతో ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.