ఆ మిల్లర్లకు ఇదే చివరి అవకాశం.. సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరిక
వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించేందుకు మిల్లర్లకు చివరి అవకాశం ఇస్తున్నామని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోగా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.
- బకాయిలు చెల్లించకపోతే డీఫాల్టర్ పీడీ యాక్ట్ పెడుతాం
హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించేందుకు మిల్లర్లకు చివరి అవకాశం ఇస్తున్నామని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోగా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. బకాయిలు చెల్లించని మిల్లర్లను డీఫాల్టర్‌గా ప్రకటించడంతోపాటు 25% జరిమానా, 12% వడ్డీతో వసూలు చేస్తామని హెచ్చరించారు. పీడీ యాక్ట్‌లు సైతం నమోదు చేస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వం వారికి ధాన్యం ఇవ్వదని తేల్చిచెప్పారు. శాఖాపరంగా చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇప్పటివరకు మొత్తం రూ.వెయ్యి కోట్ల బకాయిలు వసూలైనట్టు తెలిపారు.
ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ‘మిషన్ కే-100’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకొన్నదని, వానకాలానికి (2026-27) ముందే పెండింగ్‌లో ఉన్న సీఎమ్మాఆర్ తరలింపు, గోదాముల ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో కీలక విజయాలు సాధించినట్టు వెల్లడించారు. మిషన్ కే-100 ప్రారంభించిన 50 రోజుల్లో 11.17 లక్షల టన్నుల సీఎమ్మాఆర్ డెలివరీ సాధించినట్టు తెలిపారు. 340 మిల్లులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు గింజ డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,011కి తగ్గిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

