నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్ (జీ) మండలం బూరుగుపల్లి(కే) గ్రామాలను అనుసంధానం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు. ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలతో ఈ ఏడాది మార్చిలో కూలిపోయింది. దీంతో బూరుగుపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు వెళ్లడానికి చుట్టూ అదనంగా 14 కిలోమీటర్ల దూరం తిరగాల్సి వస్తున్నది. గత్యంతరంలేక కొందరు రైతులు తెప్పలు తయారు చేసుకుని వాగు దాటుతున్నారు. ఇంకొందరు బ్రిడ్జిపై నుంచి వేసిన మిషన్ భగీరథ ఇనుప పైపులైన్ సాయంతో దాటుతున్నారు. ప్రమాదమని తెలిసినా.. వ్యవసాయ పనులకు వెళ్లడం తప్పనిసరి కావడంతో ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు.
హైదరాబాద్, నవంబర్17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు షేక్ఇస్లాముద్దీన్ (మరో కురుక్షేత్రం న్యూస్)ను ఒడిశా రాష్ట్రం సత్కరించింది. నేషనల్ ప్రెస్డేను పురస్కరించుకుని శనివారం రాత్రి ఒడిశాలోని భువనేశ్వర్‌లో నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు, దూరదర్శన్, ఎఐఆర్, రీజినల్ ఔట్రీచ్ బోర్డ్ ఫీల్డ్ ఔట్రీచ్ బోర్డ్ అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్, మంత్రి సురేశ్ పూజారి అవార్డులు అందజేసి సత్కరించారు.